ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ సేవలు

ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ సేవలు

SRCL: వేములవాడలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గైనకాలజిస్ట్ సేవలు ప్రారంభించినట్లు ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్ తెలిపారు. ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ చొరవతో, కలెక్టర్ ఆదేశాల మేరకు సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రి నుంచి గైనకాలజిస్టును డిప్యూటేషన్‌పై వేములవాడలో నియమించారు. శనివారం ఉదయం నుంచి గైనకాలజిస్ట్ సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు.