గ్రామస్తులకు ఉచితంగా మందులు పంపిణీ

MDK: హవేలి ఘనపూర్ మండలం బ్యాతోల్ గ్రామంలో వృద్ధులకు ఉచితంగా మందుల పంపిణీ చేసినట్లు మెదక్ పట్టణానికి చెందిన రవీందర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ... రాష్ట్రప్రభుత్వం 104 వాహనాన్ని 33 నెలలుగా నిలిపివేయడంతో వృద్ధులు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని ప్రతి నెల మందులు పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.