జల్ జీవన్ మిషన్ కమిటీతో కలెక్టర్ సమావేశం
PLD: త్రాగునీరు, పారిశుద్ధ్య మిషన్ (జల్ జీవన్ మిషన్) కమిటీ సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. జిల్లాస్థాయి, మండల స్థాయి, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో చర్చించారు. వేసవికాలం సమీపించడంతో గ్రామాలలో మంచినీటి కొరత లేకుండా అధికార యంత్రాంగం ముందస్తుగానే తగు చర్యలు తీసుకోవాలన్నారు.