గుర్తుతెలియని యువతి మృతదేహం లభ్యం

KKD: మెక్లారిన్ హైస్కూల్లో గుర్తుతెలియని యువతి మృతదేహాన్ని స్థానికులు సోమవారం గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. త్రీ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియలేదని చెప్పారు. యువతి వివరాలు తెలిసినవారు సీఐ 9440796542 నెంబరుకు ఫోన్ చేసి తెలియజేయాలని కోరారు.