కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే
VSP: గాజువాక 87వ వార్డులో ఉన్న శ్రీశ్రీశ్రీ ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయంలో భావనఋషి, భద్రావతి స్వామి వారి కళ్యాణ మహోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కమిటీ ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.