అనుమానాస్పద స్థితిలో గర్భిణీ మృతి

అనుమానాస్పద స్థితిలో గర్భిణీ మృతి

ప్రకాశం: కొమరోలు పట్టణంలోని చర్చి వీధిలో నివాసముంటున్న ప్రసన్న అనే గర్భిణీ అనుమానాస్పద స్థితిలో బాత్‌రూమ్‌లో మృతి చెందిన సంఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రసన్న బాత్‌రూమ్‌లో జారిపడి తీవ్ర గాయాలతో మృతి చెందినట్లుగా భర్త నారాయణ తెలిపాడు. కాగా, ప్రసన్న కుటుంబ సభ్యులు భర్తనే హత్య చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు.