నేడు జిల్లాలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె
KDP: యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ పిలుపు మేరకు అయిదు రోజుల పని విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఉదయం 10 గంటలకు స్థానిక ఏడురోడ్ల కూడలి వద్ద సమ్మె చేస్తున్నట్లు కడప జిల్లా బ్యాంకు ఉద్యోగుల సమన్వయ కమిటీ కార్యదర్శి శ్రీనివాసులరెడ్డి తెలిపారు. ప్రభుత్వరంగ, కో ఆపరేటివ్, ఉద్యోగులు అందరూ ఈ సమ్మెలో పాల్గొనాలన్నారు.