దేవరకొండలో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి పూజలు

NLG: దేవరకొండ శ్రీ భక్త మార్కండేశ్వర స్వామి దేవస్థానంలో నాగుల పంచమి సందర్భంగా మంగళవారం శ్రీ బ్రాహ్మణ ఎల్లమ్మ పుట్ట దగ్గర దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా అభిషేక, అష్టోత్తర పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా కే అనిత సీనియర్ సివిల్ జడ్జ్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మహిళా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.