VIDEO: ప్రతీకాకు స్నాక్స్ అందించిన ప్రధాని

VIDEO: ప్రతీకాకు స్నాక్స్ అందించిన ప్రధాని

వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత మహిళల క్రికెట్ జట్టు ప్రధాని మోదీని కలిసిన సందర్భంలో ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రపంచకప్‌లో గాయపడిన ప్రతీకా రావల్, ఈ కార్యక్రమానికి వీల్‌ఛెయిర్‌లో హాజరయ్యారు. ఆమె స్నాక్స్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా, 'నీకు ఏది ఇష్టం?' అని అడిగి మరీ మోదీ స్వయంగా ఆమెకు స్నాక్స్ అందించారు. దీంతో, ఈ వీడియో వైరల్‌గా మారింది.