జిల్లాకు నేడు వర్ష సూచన

SKLM: వాయువ్య బంగాళాఖాతంలో నేడు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లావ్యాప్తంగా మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమ, మంగళ, బుధవారాల్లో జిల్లాలోని పలు మండలాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తీరం వెంబడి 40-50 KM వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది.