ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి

ఆలయ పునర్నిర్మాణ శంకుస్థాపనలో పాల్గొన్న మంత్రి

E.G: ఉండ్రాజవరం మండలం మోర్తలో శ్రీ గౌరీశ్వర స్వామి నూతన దేవాలయ పునర్నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ సోమవారం పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ శాస్త్రోక్త కార్యక్రమం ఎంతో ఆధ్యాత్మికంగా, కన్నుల విందుగా సాగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.