పెనుకొండ కొండపై అపశృతి

పెనుకొండ కొండపై అపశృతి

SS: పెనుకొండ కొండపై సోమవారం అపశృతి చోటు చేసుకుంది. పెనుకొండ కొండకు విహార యాత్రకు వచ్చిన ఆటో బోల్తా పడటంతో ఆరుగురికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. అనంతపురంకు చెందిన ముస్లిం కుటంబం ఆటోలో పెనుకొండ కొండపైకి విహార యాత్రకు వెళ్ళారు. తిరిగి వస్తుండగా కొండపై అదుపు తప్పి బోల్తా పడి ఆరుగురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.