బద్వేల్ రైతులకు సూచనలు

KDP: బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని పుట్టాయపల్లిలో సహాయ వ్యవసాయ సంచాలకులు నాగరాజు, మండల వ్యవసాయ అధికారి చంద్ర మోహన్ రెడ్డి బుధవారం పత్తి పంటను పరిశీలించారు. పలువురు రైతులకు నవధాన్య విత్తనాల కిట్లను పంపిణీ చేశారు. పచ్చిరొట్ట ఎరువుల వినియోగంతో భూమి సారవంతమవుతుందని తెలిపారు.