VIDEO: ఘనంగా వెంకన్న స్వామి కళ్యాణ వేడుకలు

MHBD: కురవి మండలం కందికొండ గ్రామంలోని కందగిరి పర్వతం వద్ద భూదేవి శ్రీదేవి సమేత శ్రీవెంకటేశ్వరస్వామి కళ్యాణోత్సవ వేడుకలు ఇవాళ అంగ రంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆలయ వైదిక కార్యక్రమాల నిర్వహణ ఆధ్వర్యంలో దేవతామూర్తుల ఉత్సవ విగ్రహాలకు కళ్యాణం జరిపించారు. ఈ కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం చేశారు.