VIDEO: కురుమూర్తి వెంకటేశ్వరస్వామి దర్శనం
పాలమూరు జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్ గుట్టలపై ఉన్న కురుమూర్తి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని చంద్రగ్రహణం కారణంగా మంగళవారం మూసివేశారు. గ్రహణం అనంతరం శుద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నేడు సంప్రోక్షణ నిర్వహించి ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నట్లు ప్రధాన అర్చకుడు వెంకటయ్య తెలిపారు. దర్శనాన్ని సద్వినియోగం చేసుకోవాలని భక్తులకు సూచించారు.