ఆయిల్ పామ్ అవగాహన సదస్సులో పాల్గొన్న కలెక్టర్
BDK: 23 మండలాల్లో 21,329 మంది రైతులు 83,850 ఎకరాల్లో సాగు చేస్తున్నారని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలను అందించే ఆయిల్ పామ్ సాగుపై రైతులు దృష్టి సారించాలని కోరారు. కలెక్టరేట్‌లో ఇవాళ జరిగిన ఆయిల్ పామ్ అవగాహన సదస్సులో మాట్లాడారు. జిల్లాలో సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు సమగ్ర కార్యచరణ అవసరమని పేర్కొన్నారు.