ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి

MDK: నర్సాపూర్ మండలం చిన్న చింతకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒక వాహనంపై ఉన్న ముగ్గురు రోడ్డుపై పడడంతో, వారిపై నుంచి లారీ వెళ్లింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు కౌడిపల్లి మండలం వెంకట్రావుపేటకు చెందిన వారిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.