జగన్‌ను కలిసిన నారాయణరెడ్డి
ప్రకాశం: చంద్రశేఖరపురంకు చెందిన వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల నారాయణరెడ్డి, వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నారాయణరెడ్డి జగన్‌కు పుష్ప గుచ్చాన్ని అందజేశారు. జిల్లాలో పార్టీ పరిస్థితిని వివరించగా, పార్టీని మరింత బలోపేతం చేయాలని జగన్ తెలిపారు.