ఆక్వా వర్సిటీపై వదంతులు నమ్మొద్దు: ఎమ్మెల్యే

ఆక్వా వర్సిటీపై వదంతులు నమ్మొద్దు: ఎమ్మెల్యే

W.G: ఆక్వా యూనివర్సిటీపై వస్తున్న వదంతులు నమ్మవద్దని, నరసాపురంలోనే యూనివర్సిటీ ఏర్పాటు జరుగుతుందని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ స్పష్టం చేశారు. సోమవారం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో తాత్కాలిక ఆక్వా యూనివర్సిటీ తరగతులను ఆయన ప్రారంభించారు. ఆనంతరం మాట్లాడుతూ.. ఆర్థికపరమైన ఇబ్బందులతో నిర్మాణ పనులు ఆగాయని తెలిపారు. త్వరలోనే నిధులు మంజూరయ్యేలా చూస్తామన్నారు.