'ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రజా దర్బార్'
అన్నమయ్య: రాజాంపేటలో శుక్రవారం టీడీపీ కార్యాలయంలో టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి వారి సమస్యలపై అర్జీలను స్వీకరించి వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కరించడమే ప్రజా దర్బార్ కార్యక్రమ లక్ష్యమన్నారు.