రోడ్డు వేశారు..క్యూరింగ్ మరిచారు.!
RR: షాద్ నగర్ పట్టణంలోని తిరుమల మెఘా టౌన్ షిప్ కాలనీలో గత 5 రోజుల క్రితం సీసీ రోడ్డు వేశారు. అయితే, CC రోడ్డుపై కట్టలు కట్టి క్యూరింగ్ సరిగ్గా చేయడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. సీసీ రోడ్డుకు నీటిని పట్టడం లేదని, సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో కొత్తగా వేసిన CC రోడ్లు మూణ్నాళ్ల ముచ్చటగానే మారనున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.