గాజులపల్లి టన్నెల్ పనులు విజయవంతం

గాజులపల్లి టన్నెల్ పనులు విజయవంతం

NDL: రైల్వే శాఖ చేపట్టిన గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ ప్రాజెక్టులో మరో కీలక అంకం పూర్తయింది. గాజులపల్లి-చెలుమ గ్రామాల మధ్య నిర్మిస్తున్న 320 మీటర్ల పొడవైన సొరంగ మార్గం (టన్నెల్) పనులు దిగ్విజయంగా పూర్తయ్యాయి. సోమవారం ఈ సొరంగం చివరి అడ్డంకిని తొలగించి విజయవంతంగా అనుసంధానం చేశారు. పనులు పూర్తి కావడంతో రైలు ప్రయాణం మరింత సులభతరం కానుంది.