అన్నా క్యాంటీన్లను ఆకస్మిక తనిఖీ చేసిన కమిషనర్
E.G: పేదల కోసం అందించే ఆహారం నాణ్యతలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదని రాజమండ్రి కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. గురువారం రాత్రి శేషయ్య మెట్ట, క్వారీ మార్కెట్ జంక్షన్లలోని అన్నా క్యాంటీన్లను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజన పదార్థాలు రుచిగా ఉంటున్నాయా అని అక్కడికి వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు.