చీరాల: వడ్డీ డబ్బులు ఇవ్వలేదని దాడి

చీరాల: వడ్డీ డబ్బులు ఇవ్వలేదని దాడి

BPT: చీరాలలో (M) బోయినవారిపాలెంలో కత్తితో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. వెంకటేష్ ఇటీవల రాజేష్ వద్ద రూ.1000 అప్పుగా తీసుకున్నాడు. ఈ మొత్తానికి వారానికి రూ.100 వడ్డీ చెల్లించేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే ఈ వారం వడ్డీ ఇవ్వలేదని రాజేష్ నిలదీయగా.. ఉన్నప్పుడు ఇస్తానని కత్తితో దాడి చేసి పారిపోయాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు.