కంకిపాడు- గుడివాడ రోడ్డు కోసం పోరాటం

కృష్ణా: కంకిపాడు- గుడివాడ మధ్య 4 కిలోమీటర్ల ప్రమాదకర రోడ్డును వెంటనే బాగుచేయాలని భవిష్యత్ భద్రతా దళ సభ్యులు అన్నారు. ఈ రోడ్‌లో మృతులకు, గాయపడినవారికి నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు. భారీ లారీ రాకపోకలు నిషేధించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం గవర్నర్‌కు రాసి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపారు.