చెక్క దువ్వెన వాడుతున్నారా?
కేశ సంరక్షణకు ప్లాస్టిక్ కంటే చెక్క దువ్వెనలను ఉపయోగించడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. చెక్క దువ్వెనలు కుదుళ్లను మృదువుగా మసాజ్ చేస్తాయి. ఫలితంగా రక్తప్రసరణ పెరిగి ఒత్తిడి తగ్గుతుంది. అలాగే కుదుళ్లు బలోపేతం అవుతాయి. ఈ దువ్వెనలు స్మూత్‌గా ఉండటం వల్ల కేశాలు తెగే అవకాశం ఉండదు. దురదకు కూడా చెక్ పెడుతుంది. అయితే చెక్క దువ్వెనల్లోనూ వేపతో చేసినవి మంచివని చెబుతున్నారు.