'ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరి'

'ఐదేళ్ల లోపు పిల్లలకు పోలియో చుక్కలు తప్పనిసరి'

SDPT: ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా దుబ్బాకలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దుబ్బాక 100 పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ హేమరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలలోపు ఉన్న పిల్లలందరూ తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవాలని సూచించారు. పోలియో చుక్కలు పిల్లలకు అంగవైకల్యం రాకుండా నివారించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన తెలిపారు.