'మండల స్థాయిలో సమస్యలను గుర్తించాలి'
KMM: ముదిగొండ మండల కేంద్రంలో ఎంపీడీవో భాస్కరరావు అధ్యక్షతన మండల స్థాయి సమావేశం గురువారం నిర్వహించారు. ఈ సమావేశానికి మధిర నియోజకవర్గ ప్రత్యేక అధికారిని జి విజయలక్ష్మి పాల్గొని మాట్లాడారు. మండల స్థాయిలో సమస్యలను గుర్తించాలని ప్రభుత్వం ఇప్పటివరకు అందిస్తున్న పథకాలతో పాటు రాబోయే కాలంలో నిర్వహించే అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించాలని అన్నారు.