'ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు'

'ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవు'

కృష్ణా: నాగాయలంక మండలంలో అనుమతులు లేకుండా ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పై కలిదిండి రాజేష్ హెచ్చరించారు. కనిగంటి శ్రీనివాసరావుకు చెందిన రెండు ట్రాక్టర్లు, అంబటి లక్ష్మణప్రసాద్ కు చెందిన ఒక టిప్పర్‌ను పోలీస్ వారు స్వాధీనం చేసుకున్నట్లు ఆదివారం తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.