VIDEO: ధనలక్ష్మీ దేవిగా భీమవరం మావుళ్ళమ్మ

VIDEO: ధనలక్ష్మీ దేవిగా భీమవరం మావుళ్ళమ్మ

W.G: భీమవరం పట్టణంలో కొలువైన శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 61వ జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలు ముగింపు సందర్భంగా అష్టలక్ష్మిలుగా అలంకరిస్తున్నారు. రెండవ రోజైన శుక్రవారం అమ్మవారిని ధనలక్ష్మి దేవీగా అలంకరించినట్లు ఆలయ అర్చకులు మద్దిరాల మల్లికార్జున్ శర్మ తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుంటున్నారు.