అందెశ్రీ ఆకస్మిక మరణంపై ఎమ్మెల్యే తీవ్ర దిగ్భ్రాంతి
KNR: జయ జయహే తెలంగాణ రాష్ట్ర గీతం రచయిత అందెశ్రీ ఆకస్మిక మరణం దిగ్భాంతికి గురి చేసిందని మానకొండూర్ MLA డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. అందెశ్రీ మరణంతో తెలంగాణ సమాజం సాహితీ శిఖరాన్ని కోల్పోయిందన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని, అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ పాట కోట్లాది మంది ప్రజల గొంతుకై నిలిచిందని ఆయన కొనియాడారు.