ధర్మవరం అభివృద్ధికి మంత్రి దిశానిర్దేశం

ధర్మవరం అభివృద్ధికి మంత్రి దిశానిర్దేశం

సత్యసాయి: ధర్మవరం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ పాల్గొని పట్టణ అభివృద్ధిపై సమీక్షించారు. అమృత్ పథకం కింద కేటాయించిన నిధులతో తాగునీరు, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. పట్టణ విద్యుత్ వ్యవస్థ బలోపేతానికి రూ.110 కోట్లతో ప్రాజెక్టు చేపట్టినట్లు వివరించారు.