భారీ వర్షం.. రైతులకు తీవ్ర నష్టం

భారీ వర్షం.. రైతులకు తీవ్ర నష్టం

SKLM: ఆమదాలవలస మండల పరిధిలో గురువారం రాత్రి 10 గంటల నుంచి సుమారు 12 గంటల వరకు ఈదురు గాలులతో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి పలుచోట్ల చెట్లు కొమ్మలు రోడ్డుకి అడ్డంగా విరిగిపడ్డాయి. రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు విద్యుత్ సరఫరాకు పూర్తిస్థాయిలో అంతరాయం ఏర్పడింది. జీడి మామిడి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.