అనంతవరప్పాడులో సీసీ రోడ్లు–డ్రెయిన్ల ప్రారంభం
GNTR: వట్టిచెరుకూరు మండలం అనంతవరప్పాడు గ్రామంలో రూ.14 లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు మరియు డ్రెయిన్లను శనివారం ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ హాజరై రిబ్బన్ కట్ చేసి నిర్మాణాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఆయన మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు.