యుద్ధం.. 180 విమాన సర్వీసుల రద్దు
పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరుల నుంచి దాదాపు 180 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ముంబైకి రావాల్సిన విమానాలు 45, ఇక్కడి నుంచి వెళ్లాల్సిన విమానాలు 48 ఉన్నాయి. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల కారణంగా ఉద్రిక్తతలు నెలకొనడంతో గత నెల 28 నుంచి పశ్చిమాసియా గగనతలంలో ఆంక్షలు అమల్లో ఉన్నాయి. దీంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.