పోస్టాఫీస్ సేవలపై గ్రామస్థుల ఫిర్యాదులు
KKD: తోండంగి(మం) వలసపాకలిలో పోస్టాఫీస్ సేవలపై గ్రామస్థులు ఈరోజు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖాతాల లావాదేవీల్లో జాప్యం, నగదు ఉపసంహరణలో సమస్యలు, సిబ్బంది సరైన సమాచారం ఇవ్వకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ విషయంపై గ్రామస్థులు పోస్టాఫీస్ అధికారులను కలిసి తమ సమస్యలను వివరించారు.