ఈనెల 10న ఆర్ట్స్ కళాశాలలో ఉద్యోగ మేళా

ఈనెల 10న ఆర్ట్స్ కళాశాలలో ఉద్యోగ మేళా

ATP: ఈ నెల 10న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ తెలిపారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాలలో ఉదయం 9 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, బీటెక్, డిప్లొమా, పీజీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు. విద్యార్హతకు అనుగుణంగా వేతనాలు ఉంటాయని తెలిపారు.