RTC బస్సు కిందపడి ఒకరు మృతి
KMR: బాన్సువాడ ఆర్టీసీ బస్టాండ్ వద్ద గురువారం రాత్రి బస్సు కిందపడి అర్భాత్ కాలనీకి చెందిన హఫీస్ (60) అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టౌన్ సీఐ తుల శ్రీధర్ తెలిపారు. బస్టాండ్ ప్రాంతంలో ఆటోల రద్దీ పెరగడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.