VIDEO: మహిళా కూలీ మృతి.. రోడ్డెక్కిన బంధువులు

VIDEO: మహిళా కూలీ మృతి.. రోడ్డెక్కిన బంధువులు

KMM: నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురం రైస్ మిల్లులో ప్రమాదవశాత్తు మృతి చెందిన కూలీ పప్పుల కళ్యాణి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం బంధువులు ఆందోళన నిర్వహించారు. ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా మిల్లు యాజమాన్యం స్పందించకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తక్షణమే ఎక్స్రేషియా ప్రకటించాలని కోరుతూ నిరసన తెలిపారు.