బీఆర్ఎస్‌లో చేరిన బీజేపీ నేతలు
హనుమకొండ జిల్లా దామెర మండల కేంద్రానికి చెందిన 5వ వార్డు బీజేపీ అభ్యర్థి వంగ నాగరాజు, 3వ వార్డు స్వతంత్ర అభ్యర్థి దామెర హరీష్ పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో ఇవాళ బీఆర్ఎస్‌లో చేరారు. మాజీ ఎమ్మెల్యే వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని చల్లా ధర్మారెడ్డి అన్నారు.