గోడ కూలి మహిళ మృతి

CTR: పూతలపట్టు మండలం బందర్లపల్లి గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మూర్తిగాను గ్రామానికి చెందిన మల్లిక అనే మహిళ బందర్లపల్లి గ్రామంలో బిల్డింగ్ పని చేస్తుండగా గోడ కూలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు.