'వైసీపీ ర్యాలీని జయప్రదం చేయండి'
KRNL: పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ ఆధ్వర్యంలో రేపు కర్నూలులో భారీ ర్యాలీ జరుగుతుందని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి తెలిపారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన కోటి సంతకాలను కేంద్ర పార్టీ కార్యాలయానికి తరలించే కార్యక్రమంలో భాగంగా ఈ ర్యాలీ నిర్వహిస్తామని చెప్పారు. నాలుగు మండలాల నుంచి భారీగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.