చిలకలూరిపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం
PLD: చిలకలూరిపేట జాతీయ రహదారిపై పరంధామయ్య కంపెనీ వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. గుంటూరు నుంచి చిలకలూరిపేట దిశగా వెళ్తున్న స్విఫ్ట్ డిజైర్ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి, అనంతరం ఎదురుగా వస్తున్న రహదారిపైకి దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ క్రమంలో ఆ మార్గంలో స్కూటీపై వెళ్తున్న ఆన్‌లైన్ డెలివరీ బాయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి.