ఆటో బోల్తా.. 15 మందికి గాయాలు

ఆటో బోల్తా.. 15 మందికి గాయాలు

SRPT: మోతే మండలం రాయపాడు గ్రామానికి పనికి వచ్చిన కూలీల ఆటో ఆదివారం రాత్రి ప్రమాదానికి గురైంది. కూలి పని ముగించుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా గరిడేపల్లి మండలం తుమ్మల పెన్ పహాడ్ గ్రామ సమీపంలో రహదారిపై అడ్డు వచ్చిన కుక్కను తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న 15 మంది కూలీలకు సల్ప గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.