పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి నివాళి
KRNL: అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా చిన్న అమ్మవారి శాల వద్ద ఉన్న ఆయన విగ్రహానికి మంత్రి టీజీ భరత్ నివాళులర్పించారు. పొట్టి శ్రీరాములు త్యాగంతోనే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందన్నారు. అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతివనం నిర్మాణానికి ప్రభుత్వం 6.8 ఎకరాలు కేటాయించిందని, శంకుస్థాపన రోజు టీజీవీ సంస్థల నుంచి రూ. 1 కోటి విరాళం ఇచ్చామని చెప్పారు.