మానస సరోవరం యాత్రలో ఎమ్మెల్సీ తోట

కోనసీమ: చైనా సరిహద్దు ప్రాంతంలోని పవిత్ర మానస సరోవరం యాత్రలో మండపేట వైసీపీ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఉన్నారు. హిమాలయాల ఒడిలో ఉన్న ఈ ఆధ్యాత్మిక ప్రదేశంలో ఆయన పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజల అభ్యున్నతి, సమృద్ధి కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మానస సరోవరం యాత్ర చేయడం తన జీవితంలో ఒక పవిత్రమైన అనుభూతి అని ఆయన పేర్కొన్నారు.