'ప్రాథమిక పాఠశాలలో రామా గౌడ్ సేవలు మరువలేనివి'
ఆసిఫాబాద్ జిల్లా కౌటాల ప్రాథమిక పాఠశాలలో రామా గౌడ్ సేవలు మరువలేనివని MEO హనుమంతు కొనియాడారు. ఆదివారం జరిగిన పదవీ విరమణ మహోత్సవంలో MEO పాల్గొన్నారు. విద్యార్ధుల్లో నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో రామా గౌడ్ కీలక పాత్ర పోషించారన్నారు. వృత్తిలో చేసిన మంచి పనులే ఎల్లకాలం గుర్తుండిపోతాయని పేర్కొన్నారు.