ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన ఎమ్మెల్యే
MDK: ప్రభుత్వం అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తుందని ఎమ్మెల్యే సంజీవరెడ్డి అన్నారు. కంగ్టి మండలం తడ్కల్ గ్రామంలో ధర్మం లక్ష్మి రాజిరెడ్డికి సంబంధించిన ఇందిరమ్మ ఇంటిని సోమవారం ప్రారంభించారు. అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారులు ఎమ్మెల్యేకు శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేదల సొంతింటి కలలను నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.