తోండంగిలో ఊపందుకున్న వ్యవసాయ పనులు
KKD: తోండంగి మండలంలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. సాగునీరు సమృద్ధిగా అందడంతో వరి నాట్లు, దున్నే పనులు వేగంగా సాగుతున్నాయి. ట్రాక్టర్లు, కూలీల సహాయంతో పొలాలను సిద్ధం చేస్తున్నారు. ఈ ఏడాది మంచి దిగుబడి వస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయం మండల ప్రజల జీవనాధారంగా నిలుస్తుండటంతో గ్రామాల్లో చైతన్యం కనిపిస్తోంది.