PGRS కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్
ప్రకాశం: మార్కాపురంలోని కలెక్టరేట్‌లో ఇవాళ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.విజయ సునీత తెలిపారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో స్పష్టంగా రాసుకొని సంబంధిత అధికారులకు అందజేయాలని సూచించారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని ఆమె కోరారు.